ప్రకాశం: పంగులూరు మండలం రేణింగివరం జాతీయ రహదారి వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైజాగ్ నుండి తిరుపతి వెళుతున్న బస్సు డ్రైవర్ నిద్ర మత్తుతో ముందు ఉన్న సిమెంటు లారీని ఢీ కొట్టాడు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉండగా వారిలో నలుగురికి గాయాలు అయ్యాయి. బస్సు డ్రైవర్ కాళ్లు క్యాబిన్లో ఇరుక్కోవడం వలన ఫ్రాక్చర్ అయ్యాయి.