BHNG: పోచంపల్లి పరిధిలోని లక్ష్మణ్ నగర్ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 12వ వార్డులో వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలిచిపోయి దోమల సమస్య పెరుగుతోందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.