NZB: బోధన్ పట్టణంలోని ఉధ్మీర్ గల్లీలో కందారి మైసమ్మ మందిరం 21వ వార్షికోత్సవాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాన్ని అలంకరించి, ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. పూజించడం ద్వారా పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించామని తెలిపారు.