విపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు మూడు ముఖ్యమైన బిల్లులను తీసుకొచ్చింది. ఇందులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా, కేంద్రపాలిత ప్రాంత సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ఉన్నాయి. ఈ మూడు బిల్లులను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది.