TG: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలతో పోటీ లేదని, సొంత పార్టీ వాళ్లతోనే అసలైన పోటీ అని మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా అందరినీ సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా. విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలి. క్రమశిక్షణతో లోకల్ ఎన్నికలకు వెళ్లాలి. అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాలి’ అని వివేక్ వ్యాఖ్యానించారు.