AP: పిఠాపురం ఆడపడుచులకు డిప్యూటీ పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం కానుక అందించనున్నారు. దీనిలో భాగంగా, పిఠాపురం శక్తిపీఠం పురుహూతిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమం శుక్రవారం జరగనుంది. దీనిలో సుమారు 10 వేల మంది మహిళలకు పసుపు, కుంకుమ, చీరలను పంపిణీ చేయనున్నారు.