TG: ఇప్పుడు HYDలో జరిగిన అభివృద్ధి సరిపోదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమకు దేశంతో పోటీ కాదని.. ప్రపంచంతో పోటీ అని ఉద్ఘాటించారు. అందుకే ఫ్యూచర్ సిటీని తలపెట్టామని చెప్పారు. ఇందులో భాగంగా తెలంగాణ 2047 ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గత సీఎంల ముందుచూపుతో.. HYDకు అంతర్జాతీయ సంస్థలు వచ్చాయన్నారు. ఓల్డ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలంటే.. మూసీని ప్రక్షాళన చేయాలన్నారు.