ATP: రేపు గుత్తి మండలం తొండపాడు శ్రీ మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మాకం శ్రీకాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మాణిక్య రంగనాథ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనాలన్నారు.