SRPT: రైతులు రసాయన ఎరువులకు బదులుగా సేంద్రియ వ్యవసాయం చేయాలని ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త మొలగూరి గోపయ్య అన్నారు. బుధవారం నడిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. సేంద్రియ ఎరువుల తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ సేంద్రియ వ్యవసాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.