SKLM: సారవకోట మండలం పురుషోత్తకర్ర గిరిజన గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లే దారి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినప్పుడు శ్మశానికి వెళ్లే దారి లేక చెరువుకు ఆనుకుని పొలాల గట్ల మీదుగా వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. సరైనా రోడ్డు మార్గాన్ని అధికారులు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.