రాజకీయ నేరాలపై కొత్త బిల్లును కేంద్రమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. తీవ్రమైన నేరారోపణలతో అరెస్టు అయితే 30రోజుల్లో పీఎం, సీఎం పదవి రద్దు అయ్యేలా బిల్లును తీసుకువచ్చారు. అయితే ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. సీఎంలు చంద్రబాబు, నితీశ్లను బెదిరించేందుకు ఈ బిల్లును తెచ్చినట్లు ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.