SKLM: హిరమండలం మండలం శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని అఖిల పక్షం నాయకులు కోరారు. బుధవారం హిరమండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. హిరమండల ప్రజల అభిమతం అనుగుణంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు, స్ధానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలని తీర్మానం చేశారు.