లోక్సభలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన ప్రధాని, ముఖ్యమంత్రుల ఉద్వాసన బిల్లుపై ప్రతిపక్ష ఎంపీలు మండిపడుతున్నారు. ఈ బిల్లును దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ఎంపీలు సవరణకు సంబంధించిన పేపర్లను చింపారు. అనంతరం వాటిని అమిత్ షాపై విసిరారు. ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.