MBNR: గండీడ్ మండల పరిధిలోని పెద్దవార్వాల్ గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల 25న టీబీ క్యాంపు నిర్వహించనున్నట్లు మండల మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. 2 వారాలకు మించి దగ్గు ఉన్నవాళ్లు, జ్వరంతో పాటు రాత్రి పూట చెమటలు పట్టడం, తెమడతో పాటు రక్తం పడేవారు పరీక్షలు చేయించుకోవాలన్నారు.