ASR: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. దేశంలో క్షయవ్యాధి నిర్మూలనే టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఉద్దేశ్యమని ప్రిన్సిపాల్ డా.కేబీకే నాయక్ అన్నారు. క్షయవ్యాధి లక్షణాలను అరకు ఏరియా ఆసుపత్రి డా.ఆదిత్య వివరించారు. ఎవరైనా టీబీ లక్షణాలతో బాధపడుతుంటే ఏరియా ఆసుపత్రికి తీసుకురావాలని డాక్టర్ కోరారు.