దక్షిణాఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అరుదైన రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో 88 పరుగులు చేసిన మాథ్యూ.. అరంగేట్రం నుంచి వరుసగా నాలుగు మ్యాచుల్లో 50 + స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. అవి కూడా మూడు వేర్వేరు జట్లపై కావడం గమనార్హం. ఇప్పటికే అతడి పేరిట డెబ్యూ మ్యాచులోనే అత్యధిక పరుగులు (150) చేసిన బ్యాటర్‌గానూ రికార్డు ఉంది.