HNK: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించే విద్యా ప్రమాణాలు బాగుండాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఉపాధ్యాయులకు సూచించారు. హసన్ పర్తి మండలం వంగపహాడ్లోని ప్రభుత్వ పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను ఉపాధ్యాయులు మెరుగుపరచాలని సూచించారు.