KRNL: జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం జరిగిన యూరియా ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశంలో, యూరియాను రైతులకు చేరకుండా అక్రమంగా మళ్లించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేసీ బి. నవ్య, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా కూడా పాల్గొన్నారు.