KDP: వేంపల్లిలో ఈ నెల 24వ తేదీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి తెలిపారు. డిక్సన్ టెక్నాలజీ (కొప్పర్తి) కంపెనీ వారి ఆధ్వర్యంలో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ZP బాయ్స్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.