ADB: భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని MLA పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రూరల్ మండలంలోని చాందా గ్రామంలో స్థానికులతో కలిసి వ్యవసాయ పొలాలను సందర్శించారు. రైతులతో ముచ్చటించి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తానని రైతులకు భరోసా కల్పించారు.