కర్నూలులో ‘డయల్ యువర్ విద్యుత్ ఎస్ఈ’ కార్యక్రమం ద్వారా విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని కర్నూలు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ ఎం. ఉమాపతి శనివారం తెలిపారు. జిల్లాలోని విద్యుత్ భవన్లో జరిగిన కార్యక్రమంలో పోల్ సంబంధిత, విద్యుత్ సరఫరాలో అంతరాయంలో కొత్త సర్వీసుల విడుదల వంటి సమస్యలపై ఫిర్యాదులు అందాయని అన్నారు.