WGL: వర్ధన్నపేట MLA నాగరాజు వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలు ఇవాళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బహిరంగంగా ఆయన తీరును ఎండగట్టారు. ఐనవోలు దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఎంపికలోనూ నాయకులు మనోవేదనకు గురవుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.