NLG: HYDలో ఈ నెల 25న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా MP ఆర్. కృష్ణయ్య సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షను విజయవంతం చేయాలని దేవరకొండ బీసీ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. బీసీ సంఘం రాష్ట్ర కార్య దర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆరోపించారు.