W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం అమ్మవారికి సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా మహిళలు భక్తులతో కీటకటలాడింది. ఆలయ ఈవో మోకా అరుణ్ కుమార్, ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ కడలి మాణిక్యాలరావు, ఆధ్వర్యంలో సిబ్బంది తగిన పర్యవేక్షణ నిర్వహించారు.