అన్నమయ్య: ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను CI రెండో పెళ్లి చేసుకున్నాడు. మహిళకు కడప జిల్లాకు చెందిన పవన్‌తో 2018లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆమె మదనపల్లి DSP కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. CI సురేష్‌కుమార్ ఆమెకు మాయమాటలు చెప్పి రెండో వివాహం చేసుకున్నాడు. భర్త ఫిర్యాదు మేరకు CIపై మదనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.