KRNL: ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామంలోని రోడ్డు అధ్వానంగా మారింది. గ్రామంలోకి ప్రవేశించే కొట్టాల వీధిలోని రోడ్డు గుంతలమయమైంది. ఈ రోడ్డు పరిస్థితి సుమారు 15 సంవత్సరాలుగా ఇలాగే ఉందని, కొత్త రోడ్డు వేయాలని ఎంతమంది నాయకులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా కొత్త రోడ్డు వేయాలని వారు కోరుతున్నారు.