NLR: నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్ మోహన్ రావు శుక్రవారం స్థానిక రామలింగాపురం కూడలిలోని అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్లో ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. నిర్దేశించిన మోతాదు నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు మూడు పూటలా అందించాలని, క్యాంటీన్ ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు ఆదేశించారు.