MBNR: మహమ్మదాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చౌదర్పల్లికి చెందిన చెన్నప్ప సొంత పని మీద బైక్పై మొకర్లాబాద్-మహమ్మదాబాద్ రోడ్డుపై వెళ్తున్నారు. బైక్ అదుపు తప్పి కమతం రాంరెడ్డి మామిడితోట వద్ద ఉన్న కంచెను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు.