SRPT: ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేసి జీవించే హక్కును పరిరక్షించాలని,పీడీఎం రాష్ట్ర నాయకుడు మొగిలిచర్ల అంజయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో బూటకపు ఎన్కౌంటర్లకు నిరసనగా 24న వరంగల్‌లో నిర్వహించే సభా పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఆదివాసీలకు జీవించే హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని పేర్కొన్నారు.