BHNG: రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైందని, రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని CPM మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మోత్కూర్లో మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు పొలాలను వదలి క్యూలైన్ల్లో నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.