CTR: టీడీపీ రామకుప్పం మండల అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ ఫోకస్ చేస్తోంది. ఇవాళ ఉదయం నుంచి రామకుప్పంలోని ప్రజలకు IVR కాల్స్ చేస్తోంది. టీడీపీ మండల అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందంటూ ఇద్దరు పేర్లతో ప్రజాభిప్రాయం సేకరిస్తోంది. ఆనిగానూరుకు చెందిన మాజీ సర్పంచ్, మాజీ రెస్కో డైరెక్టర్ రామ్మూర్తి, కెంపసముద్రానికి చెందిన వెంకటరమణ పేర్లను ప్రస్తావించింది.