KMR: ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బాన్సువాడ ఆర్టీసీ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశమాయ్యారు. సంస్థ ఆదాయాన్ని పెంచే మార్గాలు, ఖర్చులను తగ్గించే చర్యలపై సలహాలు సూచనలు ఇచ్చారు.