JN: జిల్లాలో సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి ఘనపూర్ (స్టేషన్) పర్యటన నేపథ్యంలో తగిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కల్సి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.