KRNL: పత్తికొండ మండలంలో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు మరో ముందడుకు పడింది. రూ.11కోట్ల వ్యయంతో కోతిరాళ్ల పంచాయతీ పరిధిలో ఈ యానిట్ ఏర్పాటుకు రేపు భూమి పూజ జరగనుంది. మంత్రి TG భరత్, ఎమ్మెల్యే శ్యామ్‌కుమార్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. కాగా పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల్లో టమాటా అధికంగా సాగువుతోంది.