సత్యసాయి: హిందూపురంలోని తూముకుంట చెకోపోస్ట్ వద్ద డీసీ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం 4.30 గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ వి. రత్న, జిల్లా జడ్జిలు, ఇతర రంగాల మహిళా ప్రముఖులు హాజరుకానున్నారు. వక్తల ఉపన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.