TG: రాష్ట్ర ప్రజల కల సాకారం చేసేందుకు ఈ బడ్జెట్ సమావేశాలు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ‘రైతులకు రూ.25వేల కోట్ల రుణమాఫీ చేశాం. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌లా మారింది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500లకే సిలిండర్ అందిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీలతో యువతలో నైపుణ్యం పెంచుతున్నాం’ అని అన్నారు.