ప్రకాశం: ఒంగోలు-1వ పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కిలో రూ.280 ధర పలికింది. చిలంకూరు క్లస్టర్ పరిధి నుంచి 36 బేళ్లను వేలానికి అనుమతించగా మూడు బేళ్లను తిరస్కరించారు. పొగాకు కిలో కనిష్ఠ ధర రూ.270, సరాసరి రూ. 277.82 ధర పలికినట్లు వేలంకేంద్రం నిర్వహణాధికారి రవికాంత్ చెప్పారు. రైతులు నాణ్యమైన పొగాకును వేలాన్ని తీసుకురావాలని ఆయన చెప్పారు