AKP: నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా బుధవారం తనిఖీ చేశారు. సిబ్బంది విధుల పట్ల శ్రద్ద వహించాలని, పెండింగ్లో ఉన్న పాత కేసులను త్వరితగతిన పురోగతి చేయాలని, రౌడీ షీటర్లపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. అనంతరం టౌన్లో ట్రాఫిక్ నిర్వహణను పరిశీలించి పలు సూచనలు చేశారు.