కోనసీమ: చించినాడ వంతెన, 216 జాతీయ రహదారి మరమ్మతుల నిమిత్తం మరో మూడు రోజుల పాటు వంతెనపై రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం తెలిపారు. బేరింగ్ రీప్లేస్మెంట్ పనుల కోసం ట్రాఫిక్ నియంత్రణ కొరకు ఈనెల 21, 22, 23 తేదీలలో ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.