MDK: వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కౌడిపల్లి ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. వినాయక మండపాల నిర్వాహకులు ఆన్ లైన్ నమోదు చేసి అనుమతి పొందాలని సూచించారు. పోలీస్ పోర్టర్లో పూర్తి వివరాలు నమోదు చేసి ఆ కాపీని స్థానిక పోలీస్ స్టేషన్లో ఇవ్వాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యత వహించాలన్నారు.