ELR: సెప్టెంబర్ 13వ తేదీన చింతలపూడి ఆవరణలో జరిగే మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి సీహెచ్.మధుబాబు తెలిపారు. పోలీసు అధికారులతో స్థానిక కోర్టు ఆవరణలో న్యాయమూర్తి మధుబాబు బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ చక్కని వేదికని వెల్లడించారు.