MNCL: ఉపాధ్యాయులు బోధనా సామర్ధ్యాలను పెంచుకోవాలని కోడింగ్ కోర్స్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాస్ సూచించారు. లక్షెటిపేటలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కోడింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠాలు త్వరగా అర్థం కావాలంటే శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేయాల్సి ఉంటుందన్నారు. తేలికైన పద్ధతులలో పాఠాలు బోధించాలన్నారు.