బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ, రెండో జాబితాతో బిహార్లో తమ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయనుంది. ముఖ్యంగా ఎన్డీయే కూటమిలో భాగమైన బీజేపీ, ఈ 12 స్థానాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ జాబితాలో ప్రముఖులకు స్థానం లభించింది.