NLG: ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకుగాను 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని పంపించామని తెలిపారు. ధాన్యం కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.