KMM: మధిర శ్రీనిధి డిగ్రీ కళాశాలలో భారత రత్న డా. అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కలాం జీవితం, ఆలోచనలు, దేశాభివృద్ధి పట్ల ఆయన చేసిన కృషి గురించి ప్రేరణాత్మక ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ వై. అనిల్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.