మావోయిస్టులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అగ్రనేత ఆశన్న తన టీమ్‌తో సహా రేపు లొంగిపోనున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆయుధాలతో సహా దాదాపు 70 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ లొంగుబాటుతో మహారాష్ట్రతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు బలహీనపడే అవకాశం ఉంది.