గుంటూరు నగరానికి త్రాగునీటిని అందించే హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సిబ్బంది మినహా ఇతరులను లోనికి రానివ్వద్దని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం జీఎంసీ హెడ్ వాటర్ వర్క్స్, మానససరోవరం దగ్గర కల్వర్ట్, ఆర్టీసి కాలనీ, చిన్నేరు కుంట, కోబాల్ట్ పేటలో పీకలవాగు ఆక్రమణలను ఆయన పరిశీలించారు.