VSP: ఏపీకు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుచూరి రాజేంద్ర బాబు, ఎం. యుగంధర్ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా, హామీలను ఎన్డీఏ ప్రభుత్వం విస్మరించిందన్నారు.