MNCL: కుమారుడి మృతి తట్టుకోలేక కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంచిర్యాలలో జరిగింది. రాజీవ్ నగర్లో ఆటో డ్రైవర్ చక్రవర్తి కుమారుడు పవన్ 2నెలల క్రితం జ్వరంతో మృతిచెందాడు. దీంతో మనస్తాపం చెందిన కుటుంబీకులు ఈ నెల 5న పురుగుమందు తాగారు. ఈ నెల 9 అతడి భార్య దివ్య, 11న కూతురు దీక్షిత మృతి చెందగా బుధవారం చక్రవర్తి చనిపోయాడు.