ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. కాంకేర్(D)లో 50 మంది మావోయిస్టులు భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. తమ ఆయుధాలతో సహా వారంతా స్వచ్ఛందంగా BSF క్యాంపులో లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ విధానానికి ఆకర్షితులై, హింసను వీడి సాధారణ జీవితం గడపడానికి వీరు ముందుకు వచ్చారు. ఈ లొంగుబాటును అధికారులు పెద్ద విజయంగా భావిస్తున్నారు.